calender_icon.png 11 February, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన శాస్త్రం పట్ల పిల్లలు ఆసక్తిని పెంచుకోవాలి

10-02-2025 07:08:51 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విజ్ఞాన శాస్త్రం పట్ల పిల్లలను ఆసక్తి పెంచుకోవాలని, దానికి ఇలాంటి ప్రతిభాపాటవ పోటీలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం. వెంకటేశ్వరాచారి అన్నారు. సోమవారం పాత కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో పోరమా ఫిజికల్ సైన్స్ టీచర్స్ (FPST) ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి భౌతికశాస్త్ర ప్రతిభాపాటవ పోటీల బహుమతి ప్రధానం ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... విద్యార్థినీ విద్యార్థులు భౌతిక శాస్త్రాన్ని ఆసక్తితో అభ్యసించి సమాజానికి అవసరమైన నూతన ఆవిష్కరణ చేయాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఇలాంటి ప్రతిభాపాట పోటీలలో పాల్గొనటమే ఒక గొప్ప విజయంగా భావించాలని, జయాపజయాలను సమానంగా స్వీకరించి ప్రస్తుత తప్పులను సరిదిద్దుకుంటూ జీవితంలో ముందుకు వెళుతూ ఉండాలని సూచించారు.

ఈ పోటీలో జిల్లా ప్రథమ స్థానాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లికి చెందిన ఎన్. గీత, ద్వితీయ స్థానాన్ని సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కే వల్లి శ్రీ అశ్విని, తృతీయ స్థానాన్ని భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన వై. హాసిని కైవసం చేసుకొని, ఈనెల 12న హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో జరిగే ప్రతిభాపాటవ పోటీకి ఎన్నికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కార్యదర్శి శ్రీ ఎస్. మాధవరావు, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్కే సైదులు, FPST అధ్యక్షులు షేక్, అమిరుద్దీన్, ప్రధాన కార్యదర్శి బి. సంపత్ కుమార్, జిల్లాలోని అన్ని పాఠశాలల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.