22-04-2025 10:16:38 PM
డీడబ్ల్యూఓ రాజేశ్వరి..
మంచిర్యాల (విజయక్రాంతి): పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి అన్నారు. పోషణ పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం పట్టణంలోని అశోక్ రోడ్ మేర భవన్ లో జరిగిన సెక్టార్ లెవల్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలతో పాటు చిన్నారులు ప్రభుత్వం అందించే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణీలకు సీమంతం జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత జిల్లా సమన్వయకర్త సౌజన్య, పోషణ్ అభియాన్ ఇంఛార్జీ రజిత, శ్యామల, సూపర్ వైజర్ జ్యోతి, టీచర్లు, ఆయాలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.