calender_icon.png 23 March, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి..

22-03-2025 09:03:12 PM

అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ క్రాంతి వల్లూరు...

కొండాపూర్: గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. శనివారం కొండాపూర్ మండలం, మల్కాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, ప్రతిభను పరిశీలించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన గర్భిణీ స్త్రీలు బాలింతలతో మాట్లాడి అంగన్వాడీ కేంద్రం ద్వారా వారికి అందుతున్న సేవలను గురించి వివరాలను వారితో మాట్లాడి తెలుసుకున్నారు.

సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సమయానికి టీకాలు తీసుకోవాలని ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను వైద్యుల సూచన మేరకు వాడాలని సందర్భంగా మహిళలకు సూచించారు. అంగన్వాడి కేంద్రాల ప్రకారం మహిళలకు పోషకాహారం అందించడం కోసం అభివృద్ధి కోసం అందిస్తున్న సేవలు వివరాలను కలెక్టర్ ఈ సందర్భంగా వారికి వివరించారు. అంగన్వాడి ద్వారా అందించిన సేవలను ప్రతి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, తహసిల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.