calender_icon.png 19 March, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలి

19-03-2025 12:00:00 AM

జనగామ, మార్చి 18(విజయక్రాంతి): అంగన్‌వాడీల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  సూచించారు. మంగళవారం జనగామ మండలంలోని మరిగడి గ్రా మ పంచాయతీలోని ఎంపీపీఎస్ పాఠశాల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

పిల్లలకు అందించే ఆహారాన్ని పరిశీలించి, చిన్నారులకు అందించే ఆహా రంపై జాగ్రత్తగా వ్యవహరించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలతో శుచిరుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు. 

వంట పాత్రలను తనిఖీ చేసి, కేంద్రంలోనూ, ఆహారం వండే వంట పాత్రల విషయంలో పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చిన గుడ్ల నాణ్యతను పర్యవేక్షించి, కొలత ప్రకారంగా గుడ్లు ఉండేలా సరిచూసుకోవాలన్నారు. పర్యవేక్షణలో కలెక్టర్ వెంట జీసీడీఓ గౌసియా బేగం, సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు