calender_icon.png 22 February, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలి

22-02-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిచోర బాలికల సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో పిల్లలు, మహిళలకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.

శుక్రవారం ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, నిత్యవసర సరుకులు, పరిసరాలతో పాటు అంగన్వాడీ కేంద్రం వద్ద చేపడుతున్న నవీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, సిడిపిఓ, సూపర్వుజర్, మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు