గద్వాల, జనవరి 29 (విజయ క్రాంతి): బాలలు మత్తుపదార్థాలకు అలవాటు పడకుండా ప్రతి ఒక్కరు కషి చేయాలని, వాటి వల్ల జరిగే అనర్థాలను తెలియపరచాలని జిల్లా మహిళా,శిశు సంక్షేమ అధికారి డి. సునంద అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశంలో అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉందని, బాలికల విద్య, ఆరోగ్య పరిరక్షణ, సమానత్వం అత్యంత అవసరమని వివరించారు.
ఆడ పిల్లలు సరైన పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమని, సమయానికి సరైన ఆహారం తీసుకుంటే, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండ వచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెడ్ మాస్టర్ విజయలక్ష్మి, డి.హెచ్.ఈ.డబ్లు నాగరాజు, ఎన్.జి.ఓ విద్యుల్లత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.