నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో తరగతి గదిలో పాఠాలు బోధించడం జరుగుతుందని ఇంటి వద్ద చదివించడం రాయించడం తల్లిదండ్రుల బాధ్యత అని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. శనివారం సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో పాఠశాలలో నిర్వహించిన పోషకుల సమావేశానికి హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధికి విద్యా ప్రణాళిక మధ్యాహ్న భోజన పథకం పరీక్షలకు సంసిద్ధత అంశాలపై చర్చించి విద్యార్థులకు తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.