calender_icon.png 4 April, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్త..

03-04-2025 04:51:28 PM

పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి..

రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ప్రజలకు పోలీస్ శాఖ తరపున గురువారం కొన్ని సూచనలు చేయడం జరుగుతుందని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వేసవి సెలవులు రాబోతున్నాయి. తల్లిదండ్రులందరూ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసు శాఖ వారు కోరుతున్నారు. ఈ సందర్భంగా రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ మాట్లాడుతూ... ప్రజలకు పలు సూచనలు చేశారు. వేసవి సెలవుల్లో దగ్గర్లో ఉన్న చెరువులు, బావులలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉందని అలాగే స్మార్ట్ ఫోన్స్ వినియోగంపై దృష్టి పెట్టగలరని కోరుతున్నామన్నారు.