నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠాశాలల్లో అమలు చేస్తున్న భోజనంపై జిల్లా విధ్యశాఖ అధికారి రామారావు ఆగ్రహాం వ్యక్తం చేశారు నిర్మల్ మండలం లోని రత్నాపూర్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనఖీ నిర్వహించారు. వంటశాలను సందర్శించిన ఆయన పిల్లల కోసం వండిన ఆహారంను పరిశీలించారు. మెను ప్రకారం భోజనం ఇవ్వకపోవడంపై మండి పడ్డారు. వంటశాలలు శుభ్రంగా ఉంచాలని అన్నారు. తరగతులు భోధన అడిగి తెలుసుకొన్నారు. అంతకు ముందు నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనఖీ చేసి ప్రార్థనలో పాల్గోన్నారు. సమయ పాలన పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆనంతరం జిల్లా కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి విద్య ప్రమాణాల పెంపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కోన్నారు.