- కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి
- విద్యాకమిషన్‌కు ప్రతిపాదించిన టీపీటీఎఫ్ నేతలు
- ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్న చైర్మన్
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో కామన్‌స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రొగ్రిసివ్ టీచర్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అటెండర్ నుంచి మంత్రి పిల్లలైనా ప్రభుత్వ బడుల్లో చదువుకునేలా కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. తెలంగాణ విద్యాకమిషన్ చైర్మ న్ ఆకునూరి మురళితో టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రతిపాదనలు అందజేసినట్లు శనివారం తెలిపారు. ఆయన సానుకూల ంగా స్పందించినట్టు వెల్లడించారు.