మానకొండూరు, జనవరి 26: ఎంతో సంతోషంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన చిన్నారులు విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో సుమారు 2 గంటల పాటు ఎండ బారిన పడాల్సిన పరిస్థితి తిమ్మాపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కరీంనగర్ ఉప రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ రోడ్డు భద్రత మాసోత్సవాల అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఉప రవాణా శాఖ డిటిసి పెద్దింటి పురు షోత్తం, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తాము చెప్పాలని సూచించారు.
హెల్మెట్ ధరిం చడం వల్ల ఎలాంటి ప్రమాద బారిన పడ కుండా కుటుంబానికి భరోసాగా నిలబడిన వారవుతారని స్పష్టం చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్స్ నియమ నిబంధనలు పాటించి క్షేమంగా తమ గమ్యాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు నోట్ బుక్స్ లను పంపిణీ చేశారు. డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవిఐ రవికుమార్, ఏ ఎం వి ఐ లు స్రవంతి హరిత యాదవ్, లతోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల యాజమాన్యం పై పేరెంట్స్ సీరియస్
పిల్లలకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించకుండా ఎండలో 2 గంటల పాటు కూర్చోపెట్టడంపై పిల్లల తల్లిదండ్రులు చైతన్య స్కూల్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ఆధారం లేకపోవడంతో విద్యార్థులే పట్టుకోవడం గమనార్హం.
ప్రోగ్రాం జరుగుతున్నంత సేపు చిన్నారులతోపాటు, విద్యార్థిని విద్యార్థులు ఎండలో కూర్చోబెట్టి జాతీయ రోడ్డు భద్రత పై అవగాహన కల్పించడంపై ప్రోగ్రాంలో పాల్గొన్న కొంతమంది పేరెంట్స్ అసహన వ్యక్తం చేశారు. రవాణా శాఖ అధికారులు,స్కూల్ టీచర్లు,సిబ్బంది చెట్ల కింద కుర్చీలలో కూర్చుని,చిన్నపిల్లలను మాత్రం ఎండలో కూర్చోబెట్టారు.
ఎండ దెబ్బను తట్టుకోలేక కొంతమంది చిన్న పిల్లలు చున్నిలు, టీషర్ట్,లను కప్పుకుని రెండు గంటలపాటు ఇబ్బంది పడ్డారు. కొందరు పిల్లలు ఎండ దెబ్బకు తట్టుకోలేక నీడ చాటున వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను టీచర్లు బెదిరించి బలవం తంగా కార్యక్రమంలో కూర్చోపెట్టారు.
ఈ సందర్భంగా పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి తమ పిల్లలను ఇంటికి పంపిస్తారనుకుంటే కళాశాల యాజమాన్యం పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఎండలో తమ పిల్లల్ని కూర్చోబెట్టి ప్రభుత్వ అధికార ప్రోగ్రాంలో పాఠశాల యాజమాన్యం మెప్పు పొందేందుకు ప్రోగ్రాం నిర్వహించడం పై పేరెంట్స్ సీరియస్ అవుతున్నారు.