11-04-2025 12:06:31 AM
ఇంచార్జి సీడీపీఓ బాలీశ్వరి
పెబ్బేరు ఏప్రిల్ 10: పిల్లలకు అటు గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించటంతోనే వారు ఆరోగ్యంగా, ధృడంగా తయారౌతారని ఇన్చార్జి సీడిపీఓ బాలీశ్వరి గురువారం తెలిపారు. మండ్ల పరిధిలోని రంగాపురం గ్రామంలోని అంగన్వాడీ కేం ద్రంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా జిల్లా సంక్షే మ అధికారి సుధారాణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషక పదార్థాలు వాటి ఉపయోగం గురించి వివరించారు.
పిల్లల తల్లులకు ప్రీ స్కూల్ గురిం చి వాటి విధానం గురించి పూర్తి స్థాయిలో వివరించాలని సూచించారు. అనంతరం ఓ చిన్నారికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏసిడిపిఓ ఝాన్సీ, లక్ష్మి, సూపర్ వైజర్ వినోద, ఎం ఎల్ ఓహెచ్పీ వినీల, ఏఎన్‌ఎం శివకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు నర్మద, రాధ, లలిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.