కె. కల్పనా చౌదరి :
‘ఒక దేశాన్ని నాశనం చెయ్యాలి అంటే ఆ దేశం మీద అణుబాంబును ప్రయోగించాల్సిన అవసరం లేదు, ఆ దేశ విద్య వ్యవస్థను నాశనం చేస్తే చాలు’.. ఈ మాట లు చాలు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఒక్క చదువుకే ఉందని తెలియ జేయడానికి. అలాంటప్పుడు, ఆ చదువును అందించడం, అందరి అందుబాటులో ఉంచడం కూడా ఎంతో అవస రం.
ఇప్పుడు పరిస్థితి ‘చదువుకుంటున్నా మా, చదువు కొంటున్నామా’ అన్నట్టు ఉంది. ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడితే చాలా ప్రశ్నలు ఉత్ప న్నం అవుతాయి...! మొట్టమొదటగా, అస లు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఎందు కు చేర్పించడం లేదనేది ప్రధానమైన ప్రశ్న.
మనకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, ప్రభుత్వం ఏర్పరిచే మౌలిక సదుపాయాలన్నీ కావాలి...! కానీ ప్రభుత్వ పాఠశాల వద్దు...! ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు సరైన వసతులు ఉండడం లేదు. ఈ రెండు విషయాలు ఒకదానికి ఒకటి పరిపూరకాలు అని చెప్పొచ్చు.
ఇక పోతే స్కూల్‌లో పిల్ల వాడి నమోదు ఎంత ముఖ్యమో ఆ పిల్లవాడు ప్రతిరోజూ హాజరు అవడం అంతే ముఖ్యం. చాలా మంది ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలు సక్రమంగా హాజరు కావడం లేదనేది ఇంకో పెద్ద సమస్య... ఈ సమస్యని అధిగమించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, స్వ యం సహాయక బృందాలు అన్నీ సమన్వయం తో పని చెయ్యాల్సిన అవసరం ఉంది.
సమాజాన్నే మార్చే శక్తి
చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ కుటుంబానికి చెందిన సామాజిక వర్గాన్ని మారుస్తుంది. పేదరికపు సంకెళ్లు తెంచుకోవడానికి, జీవన గమనంలో అభివృద్ధి సాధించడానికి చదువే అస్త్రం అనేది నేటి ఉపాధ్యాయుడు బలంగా సమాజంలోకి తీసుకెళ్లగలిగితే 80 శాతం పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరిగే అవకాశం లేకపోలేదు.
అంతే కాకుండా బాలికల విద్య అవ సరాలు, పరిశుభ్రత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి పాఠశాలలో బాలికల సంఖ్యను బట్టి మరుగుదొడ్లు ఉండాలి. కొన్ని విద్యాలయాల్లో 100 మం ది పిల్లలకు ఒకే మరుగుదొడ్డి మాత్రమే ఉంటున్నది. అవికూడా నిరుపయోగంగా ఉంటున్నాయి.
పాఠశాలల్లో పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఆడపిల్లల ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది. తద్వా రా ఆడపిల్లలు చదువు మానేసి పాఠశాలలకు రావడానికి ఆసక్తి చూప డం లేదు. ఇంకో ప్రముఖమైన విషయం ఉపాధ్యాయుల శిక్షణ.
ప్రభుత్వ పాఠశాలలలో ఉపా ధ్యాయుల శిక్షణ చాలా అవసరం. మంచి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధన విధానాలు, నూతనమైన పరిజ్ఞానం, విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
20 శాతం స్కూళ్లలో మరుగుదొడ్లే లేవు
ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రభు త్వ పాఠశాలల్లో పిల్లల శాతం తగ్గిపోడానికి ఇం కో ప్రధాన కారణం మౌలిక వసతులు లేకపోవడం. ఇంత పెద్ద వ్యవస్థ అయిన ప్రభు త్వం, స్కూళ్లలో కనీస వసతులు కల్పించలేక పోవడానికి కారణం అందరం ఆలోచించాలి...! ఈ విషయంలో ప్రతి ప్రభుత్వం విఫలం కావడం శోచనీయం.
పాఠశాలల్లో సరిపోయినన్ని గదులు, విశాలమైన ఆవరణ, టాయిలెట్స్, పుస్తకాలు, టీచర్లు, తాగు నీరు, పరిశుభ్రత, ఆట మైదా నం వంటి అన్ని అంశాలలో కొరత ఉంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సర్వే ప్రకారం తెలంగాణలో దాదాపు 20 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు మరుగుదొడ్డి సదుపా యం లేదు. ఉన్నా 21.2 శాతం నీటి సౌక ర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి.
రాష్ట్రంలో 30,023 పాఠశాలలు ఉంటే వాటిలో 11,124 పాఠశాలలకు నల్లా నీటి సౌకర్యం లేదు. 1,859 పాఠశాలలకు తాగు నీరు సరిపడా లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,288 పాఠశాలలు ఉండగా 1,052 స్కూల్స్‌కు మాత్రమే నల్లా కనెక్షన్ ఉంది. 258 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు.
అటు భద్రాద్రి కొత్తగూడెంలో 1,466 పాఠశాలకు గాను 758 స్కూళ్లలో తాగునీటి సదుపాయం లేదు. 93 స్కూల్స్‌కు మరుగుదొడ్లు లేవు. ఇక్కడ ప్రాథమిక విద్యను పూర్తి చేసిన బాలికలు ఉన్నత చదువులకు వెళ్లే సరికి డ్రాప్‌అవుట్ రేట్ గణనీయం గా పెరుగుతున్నది.
ఆర్థ్థిక ప్రగతికి దోహదం
మౌలిక సదుపాయాలు విద్యార్థులకు సురక్షితమైన, శుభ్రమైన,సౌకర్యవంతమైన వాతావరణం అందిస్తాయి, ఇది వారి ఆరోగ్యం, తరగతిలో నిబద్ధతను పెంపొందిస్తుంది. ఈ సదుపాయాలలో పెట్టుబడి పెట్టడం విద్యా ఫలితాలను మెరుగుపరచడం రాష్ట్రానికి ఎంతో అవసరమైన మూలధన నిధి అవుతుంది.
ఇది ముందు రోజుల్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడుతుంది.. కొన్ని జిల్లాఓ్ల కొంతమంది కలెక్టర్ల చొరవతో ప్రభుత్వ స్కూళ్లలో వసతులను మెరుగు పరచి పిల్లల నమోదును పెంచుతున్నారు. ఇది సదా అభినందనీయమైన విషయం. కానీ, పిల్లలు ఎక్కు వగా ఉన్న స్కూళ్ళలో టీచర్ల కొరత, టీచర్లు అధికంగా ఉన్న చోట్ల పిల్లలు లేకపోవడం అనేది చాలా చోట్ల ఉన్న సమస్య.
దీన్ని పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. ఇది లా ఉండగా విద్యా ప్రమాణాలు పెంచవలసిన బాధ్యత ఉపాధ్యాయులమీద ఉంది. కాలానికి అనుగుణంగా మార్పులతో కూడి న విద్య ఆచరణాత్మకంగా బోధించాల్సిన అవసరం ఉంది. గత 20 సంవత్సరాలుగా ఒకే రకమైన బోధన పద్ధతులను కొన్ని స్కూల్స్ ఇంకా పాటిస్తున్నా యి ఆధునిక పద్ధతులు అయిన ఆడియో వీడియో ద్వా రా సాధన చేయిం చి విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించాలి సిన ఆవశ్యకత ఉంది.
ఇక పోతే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు కొన్ని వెనకబడిన, అణగారిన వర్గాలలోని పిల్లల విద్యావసరాలను తీరుస్తున్నాయి. నాణ్యమైన విద్య ప్రమాణాలను అందించాలనే ఉద్దేశ్యం తో స్థాపించిన ఈ విద్యాసంస్థలు కొన్ని చోట్ల ఆ ప్రమాణాలను పాటిస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాయి. కానీ ఈ పరిస్థితి అన్నీ చోట్లా ఒకేలా ఉందా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం వస్తుంది.
దీనికి కారణంగా కొంత మంది ప్రిన్స్‌పాల్స్ చెప్తున్న మాట ‘మేము పొద్దున్న లేచిన దగ్గరనుంచి హాస్టల్లో అవసరాలు, మెస్ అవసరాలు, మెడికల్ అవసరాలు, ఉప్పులు, పప్పులు అని పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఉండడం. ఇలా ప్రతిదీ చూసుకోవడానికే సమయం అంతా సరిపోతుంది. అందువల్ల విద్యా ప్రమాణాల మీద దృష్టి పెట్టలేకపోతు న్నాం’ అని.
ఆలా కాకుండా ఒక దగ్గర కిచెన్ ఏర్పాటు చేసి ఒక మండలంలో కొంత మందికి బాధ్యతలు అప్ప చెప్పి సమయానికి స్కూల్‌కు తీసుకొచ్చి భోజనం పెడితే బావుంటుంది.ఇక పోతే ఆడపిల్లల చదువుపైన అన్ని వర్గాలు నిశితమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.. ఆడపిల్లల చదువు వసతుల విషయంలో విద్యాశాఖ మరింత చొరవ తీసుకోవాలిసినఅవసరం ఉంది.
అలాగే తల్లితండ్రులు ఉపాధ్యాయులకు, అధికారులకు సహహరించాల్సిన అవసరం ఉంది. బాలికలకు ఉన్న అవకాశాలను గ్రహించి తల్లితండ్రులు ప్రోత్సహిం చాలి. ఆడపిల్లల విద్య, ఆరోగ్య, పోషణ విషయాలలో అధికార యంత్రాంగం దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికనచర్యలు తీసుకోగలిగితే నాణ్యమైన మౌలిక వసతులతో తెలంగాణలో ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలకు పంపే విధంగా చర్యలు తీసుకోవ చ్చు.
చివరిగా విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి విభిన్న, వినూత్న మార్గాలు అమలు పరచడం అవసరం. ఇందులో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ముఖ్యం. ఉపాధ్యాయుల శిక్షణ మరియు బోధన పద్దతులను మెరుగుపరచడం కూడా అవసరం.
ఈ ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం, మెరుగైనశిక్షణ వాతావరణం కల్పించడం ద్వారా తెలంగాణలో విద్యా ఫలితాల ను మెరుగుపరచవచ్చు. విద్యార్థుల నమోదు పెరుగుతుంది, అందరికీ నాణ్యమైన విద్య అందిస్తుంది. ఈ మార్పులు విజయవంతం కావాలంటే సరిగ్గా అమలు, నిరంతర పర్యవేక్షణ అవసరం.
వ్యాసకర్త సెల్: 9908213364