calender_icon.png 2 November, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేతో పిల్లల చదువుకు ఆటంకం!

02-11-2024 01:11:54 AM

  1. ఉదయం విధులు, మధ్యాహ్నం సర్వే చేయాలంటూ అధికారుల ఆదేశం
  2. ఒకపూటే నడవనున్న 18 వేలకుపైగా స్కూళ్లు
  3. కులగణన సర్వేపై టీచర్ల భిన్న స్వరాలు
  4. సర్వేలో పాల్గొనేవారు అంగీకారపత్రం ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్, నవంబర్ 1(విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేపై ఉపాధ్యాయులు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. తమకెందుకు విధులు వేశారని కొందరు, తమకు విధులెందుకు వేయలేదని ఇంకొందరు.. సర్వేకు వెళితే పిల్లలకు పాఠాలెవరు బోధిస్తారని మరికొందరు.. ఇలా  భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు విద్యాశాఖ మాత్రం ఉపాధ్యాయులు డోర్ టు డోర్ కులగణన సర్వేలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం విధులు నిర్వర్తించి, మధ్యాహ్నం సర్వేలో పాల్గొనాల ని ఆదేశాలు జారీచేసింది. సర్వేలో పాల్గొనాలనుకునే వారు శనివారం ఉదయం 8 గం టలలోపు ఎంఈవోలకు అంగీకార పత్రాన్ని అందించాలని ఆదేశాలు జారీచేశారు.

సర్వే లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేయ ని టీచర్లు స్కూళ్లను నడపాలని సూచించా రు. సర్వేలో పాల్గొనే టీచర్లు మధ్యాహ్న భో జనం వరకు పాఠశాలలను నడిపి ఆ తర్వాత ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

ఒకవేళ సర్వే చేసేందుకు పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు సుముఖత చూపితే ఆయా పాఠ శాలలను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడిపి, మధ్యాహ్నం బడికి సెలవు ప్రకటించి సర్వేలో పాల్గొనాలని ఆదేశించారు.

సర్వేతో చదువు ఆగం..

టీచర్లను విద్యాబోధనకు తప్ప విద్యేతర అవసరాలకు వాడొద్దని సుప్రీంకోర్టు గతం లో తీర్పునిచ్చింది. ఈ హెచ్చరికలను బేఖాతరుచేస్తూ రాష్ర్ట ప్రభుత్వం కొన్నిచోట్ల ఒక పూట, మరోచోట రెండు పూటలూ స్కూళ్లకు తాళం వేయనుంది. ప్రత్యేకించి 18 వేలలకు పైగా ప్రాథమిక బడులను సగంపూటే నడిపి మరో సగంపూట తాళం వేయనున్నది.

ఇలా మూడు వారాలపాటు సర్వే పేరుతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగనుంది. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర్తిగా అంపశయ్యపైకి చేర్చే చర్యలను ప్రభుత్వం చేపడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సెలవురోజుల్లో లేదా వేసవి సెలవుల్లో చేయాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక తరగతుల్లో చది వే విద్యార్థుల సామర్థ్యాలు అంతంత మా త్రంగానే ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు అదే స్కూ ళ్లలోని ఉపాధ్యాయుల (ఎస్జీటీ) సేవలను మూడు వారాల పాటు వినియోగిస్తే పిల్లల చదువులు ఆగం కానున్నాయి.

ఈ నిర్ణయం తో 18,241 ప్రాథమిక స్కూళ్లు సగంపూట మూతపడనుండగా, 1- తరగతుల్లోని సు మారు 10లక్షల మంది  విద్యార్థుల చదువు లు 20 రోజుల పాటు చదువులు ఆగం కానున్నాయి. విద్యాశాఖ తీరును పలు ఉపాద్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మరీ చదులు సాగేదెప్పుడు.. 

విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభమై నా జూలై వరకు అడ్మిషన్లు, పుస్తకాలు, యూ నిఫారాల పంపిణీతోనే గడిచిపోయింది. ఇప్పటికే టీచర్ల బదిలీలు, పదోన్నతులతో బోధనకు ఆటంకమేర్పడింది. ఆ తర్వాత టీచర్ల సర్దుబాటును చేపట్టారు. కొంతమందిని బదిలీలు చేసినా సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లల్లో ఉన్నవారిని రిలీవ్ చేయలేదు.

ఇక సెప్టెంబర్ 30 డీఎస్సీ ఫలితాలు విడుదల చేసి కొత్త టీచర్లను రిక్రూట్ చేశారు. వీరికి పోస్టింగ్స్‌నిచ్చి గతంలో బదిలీ అయిన వారి ని రిలీవ్ చేశారు. అక్టోబర్ తొలివారంలో కొత్త టీచర్లు విధుల్లో చేరారు. ఇక దసరా, దీపావళి సెలవులు, పరీక్షలతో అక్టోబర్ మాసం గడిచిపోయింది.

నవంబర్ మాసంలోనైనా చదువులు గాడినపడతాయను కుంటే కుల గణన సర్వే వచ్చింది. ఇలా ఒకదాని వెంట ఒకటివస్తే విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.   

సర్వే డ్యూటీలో సగం మంది టీచర్లే..

రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సమగ్ర ఆర్థిక సర్వేను మూడువారాల పాటు నిర్వహించనున్నారు. సర్వే కోసం ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, టీచర్లను ప్రభుత్వం వినియోగించనుంది. మొత్తంగా 80 వేల మంది సిబ్బందిని, ప్రభుత్వ ఉద్యోగులను సర్వే కోసం ప్రభుత్వం రంగంలోకి దించనుంది.

వీరిలో 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు, 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్ల సిబ్బంది, మరో 2వేల మంది పాఠశాలల్లో పనిచేస్తున్న టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లున్నారు. మొత్తం 80 వేల మందిలో సగం మంది సర్కారు టీచర్లే ఉన్నారు.