calender_icon.png 20 October, 2024 | 4:27 PM

పిల్లలు ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా!

06-07-2024 02:30:00 AM

ఫోన్లకు తెగ అలవాటుపడిన పిల్లలు నలుగురిలో అంత ఈజీగా కలవలేరు. పదిమందిలో మాట్లాడాలంటే పిల్లలు భయపడుతుంటారు. ఆనందోత్సాహాల మధ్య హాయిగా సాగిపోవాల్సిన బాల్యం భారంగా మారుపోతుంది. అలాంటప్పుడే పేరెంట్స్ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రతిరోజూ ఓ అరగంట అయినా పిల్లలకు కబుర్లు చెబుతూ ఉండాలి. పిల్లలు చిన్నబుచ్చుకుంటే పర్వాలేదు. ఫోన్ చూడకుండా కఠిన నిబంధనలు పెట్టాలి. ఫోన్ చూసే వేళలు ఫిక్స్ చేయాలి. వాళ్లు ఏం చూస్తున్నారో ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. నిదానంగా స్క్రీన్ టైమ్ తగ్గిస్తూ.. ఫోన్ అలవాటును దూరం చేయాలి. పిల్లలకు ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పిస్తే.. వాళ్ళు ఫోన్ జోలికి వెళ్లారు.