calender_icon.png 31 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

06-07-2024 12:00:00 AM

మానవత్వం చాటుకున్న కండక్టర్ 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసలు

రాజేంద్రనగర్, జూలై 5: ఓ మ హిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి ప్రసవం చేయడంతో అందరూ ఆమెను అభినందిస్తున్నా రు. శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్ ప్రాంతంలో బస్సు ఎక్కింది. బహదూర్‌పుర దగ్గరకు రాగానే ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. గమనించిన మహిళా కండక్టర్ సరోజ బస్సులోని మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. శ్వేతారత్నం పం డంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా కండక్టర్ సరోజతో పాటు బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులను ఆర్టీ సీ ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. సకాలంలో స్పం దించడంతోనే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.