హులా హూప్ స్పిన్‌లో ప్రతిభ
అవార్డు అందజేసిన వరల్డ్‌వైడ్ బుక్ ఆప్ రికార్డ్స్ సంస్థ
పటాన్‌చెరు,(విజయక్రాంతి): పటాన్‌చెరు పట్టణం నందన్ ఫ్రైడ్ కాలనీకి చెందిన నాలుగేళ్ల అరవింద హులా హూప్ స్పిన్ (నడుము చుట్టు రింగ్ తిప్పడం)లో ఒక నిమిషంలో రెండు వందల రౌండ్లు తిప్పి తన ప్రతిభను చాటుకుంది. చిన్నారి ప్రతిభను గుర్తించిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అరవిందకు ప్రశంసా పత్రం, అవార్డు అందజేసింది. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ యువనాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ శనివారం చిన్నారి అరవిందను, తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. అరవింద భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.