16-04-2025 01:08:22 AM
ఈ నేరానికి పాల్పడిన దవాఖానలలైసెన్స్ రద్దు చేయాలి
సుప్రీంకోర్టు ఆదేశం
యూపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: నవజాత శిశువుల అక్రమ రవాణా కేసుల వ్యవహారంలో యూ పీ ప్రభుత్వ తీరుపై అత్యున్నత ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ దవాఖానలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగి నట్టు తేలితే వాటి లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. అక్రమ రవాణా నిరోధానికి కఠిన నిబంధనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. యూపీలో ఇటీవల ఓ ఆస్పత్రిలో నవజాత శిశువు కిడ్నాప్‌నకు గుర య్యాడు. దీంతో ఆ చిన్నారి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ శిశువును దుండగుడు విక్రయించగా, నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
అనంతరం బెయిల్ మంజూరైంది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా గా ఈ కేసును విచారించిన కోర్టు చిన్నారుల అక్రమ రవాణా కేసులపై యూపీ ప్ర భుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూ రు చేసిన అలహాబాద్ హైకోర్టుపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. ‘ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల్లోపు పూర్తి చేయాలి. రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలి’ అని ఆదేశాలు జారీ చేసింది. ఏ ఆస్పత్రిలోనైనా అక్రమ రవాణా జరిగినట్టు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించింది.