22-04-2025 12:22:27 AM
షీటీం ఇంచార్జ్ విజయలక్ష్మి
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి) వేసవి సెలవుల్లో ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉండే అవకాశం ఉన్నపుడు తల్లిదండ్రులు, సంరక్షకులు జాగ్రత్తగా ఉండాలని షీటీం ఇంచార్జ్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లాలోనీ కోడెర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉండే అవకాశం ఉందని ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, లైంగిక దాడికి పాల్పడిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అమ్మాయిలు ఎక్కువగా తెలిసిన వారిచే మోసపోతున్నారని, కుటుంబం వెలుపలి వ్యక్తులను అంత ఈజీగా నమ్మకూడదన్నారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు షేర్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.
ప్రస్తుతo సోషల్ మీడియా వాడకంలో అపరిచిత వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని, తమ వ్యక్తిగత వివరాలిస్తూ మోసపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ పాఠశాల ఇంచార్జి కవిత, షీటీం మెంబర్ వెంకటయ్య, భరోసాటీం జ్యోతి, టీచర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.