17-03-2025 01:38:09 AM
ఆమనగల్, మార్చి 16 (విజయ క్రాంతి ) ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జంతుక ఈదమయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇట్టి విషయం తెలుసుకున్న 1988-89 పదవ తరగతి బ్యాచ్.. బాల్యమిత్రులు ఆదివారం ఓవైసీ దవఖానలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి రూ. 40 వేల ఆర్థిక సాయం అందించారు. అధైర్యపడుద్దని తాము అండగా ఉంటామని తోటి మిత్రులు భరోసా కల్పించారు.