జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేం దుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ కు పోక్సో చట్టం పై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరి కట్టేందుకు ప్రతీ పాఠశాలలో చైల్ ప్రొటెక్షన్ అధికారిని నియమించా నాని కోరారు. పోక్సో చట్టం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఆయా విద్యా సంస్థల్లో సి.సి టివి లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. పోక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన వారు తెలియజేయాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి తెలిసి ఉండాలని అన్నారు.
పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సి. డబ్ల్యూ.సి. మెంబర్ స్వర్ణ లత, యునిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.