24-02-2025 12:11:54 AM
జోగ్యతండా గ్రామంలో విషాదఛాయలు
మహబూబాబాద్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): కన్నతల్లి తన సుఖం కోసం బిడ్డలను కల తేర్చాలని చూసిన సంఘటన అందరి తెలిసిందే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని జోగ్యతండాలో జరిగిన ఘటనలో 20 రోజుల నుంచి చావుబతుకుల మధ్య హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ లో పోరాటం చేస్తున్న వరుణ్ తేజ్, నిత్య శ్రీ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డ కుమారుడు వరుణ్ తేజ్ రాత్రి 1గంట సమయంలో కూతురు నిత్య శ్రీ మృతి చెందింది పాప మృతి చెందడంతో జోగ్యతండా గ్రామం కన్నీటి సముద్రంలోమునిగిపోయింది. హైదరాబాద్ పోస్టుమార్టం పూర్తిచేసుకుని చిన్నారి మృతదేహం స్వగ్రామం జోగ్యతండాకు రానుంది కాగా చిన్నారులన చంపాలని చూసిన కన్నతల్లిపై గ్రామంలో ప్రజలు తిరగబడే అవకాశం ఉందని తెలుస్తోంది.