calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలు చట్ట విరుద్ధం

18-04-2025 12:25:26 AM

కల్లూరు, ఏప్రిల్ 17 :-మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామ పంచాయితీలోని ఒకట వ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్ష్యం కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మ ల జ్యోతి  మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తినాలని సూచించారు.

చిరుధాన్యాలు ఆవశ్యకత గురించి తెలియజేశారు. పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. పిల్లలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని తెలియ జేశారు.  అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే ఆరో గ్య లక్ష్మి భోజనం క్రమం తప్పకుండా తల్లు లు, పిల్లలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా బాల్య వివాహాలు జరగకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ సుజాత, అంగన్వాడీ టీచర్స్ జ్యోతి ,పద్మ ,యశోద, మంగామణి , కృష్ణవేణి ,లక్ష్మి ఆయాలు,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.