23-04-2025 12:41:20 AM
సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజిత
గోపాలపేట ఏప్రిల్23 : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరంగా కఠిన శిక్షలు అమలు అవుతాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి రజని అన్నారు. మంగళవారం గోపాలపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యి మాట్లాడారు.
వేసవి సెలవుల్లో విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమైన చట్టాలను వివరించడంలో భాగంగా పోక్సో యాక్ట్ బాల్యవివాహాల చట్టం మోటార్ వెహికల్ యాక్ట్ బాల కార్మికుల చట్టం సైబర్ క్రైమ్స్ గురించి తెలియజేశారు ఉచిత న్యాయ సలహాల కొరకు 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం శ్రీదేవి పాఠశాల ఇంచార్జ్ జ్యోతి ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.