calender_icon.png 30 March, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహం చట్టరీత్య నేరం

27-03-2025 04:40:16 PM

బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్..

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం అని బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్ అన్నారు. గురువారం కేరామేరీ మండలం ఈసాపూర్ గ్రామంలో మైనర్ అమ్మాయికి వివాహం జరుగుతున్నట్లు ఒక్క సమాచారం మేరకు గురువారం బాలల సంరక్షణ, సఖి కార్యాలయ అధికార బృందం గ్రామాన్ని సందర్శించి మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బూర్ల మహేష్ మాట్లాడుతూ... బాల్యవివాహాలు చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.

అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని లేనిపక్షంలో బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటమన్నారు. మైనర్ అమ్మాయిని తాత్కాలిక వసతిపై సఖి కేంద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో సఖి సిఏ సమత సిబ్బంది సుమలత, బాల ప్రవీణ్ కుమార్, డోంగ్రి ప్రవీణ్ కుమార్, ఝాన్సీ రాణి, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.