calender_icon.png 10 January, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మికులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

10-01-2025 01:45:10 AM

గద్వాల, జనవరి 9 (విజయక్రాంతి ) : ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా బాల కార్మికులు భిక్షాటన చేస్తున్న వీధి బాలలను గుర్తించి వారికి ఆశ్రమం కల్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. గురువారము సమీకృత జిల్లా కార్యాల యాల సముదాయ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్  లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఆపరేషన్ ముస్కాన్ జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ టీములు చురుకుగా పని చేస్తున్నాయని ఇప్పటి వరకు 18 మంది బాల కార్మికులను రక్షించడం జరిగిందని తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో పాఠశాలకు రావడం మానేసిన 181 మంది డ్రాప్ అవుట్లను గుర్తించడం జరిగిందని, వీరిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు.  జిల్లాలో రిస్క్ చేసి పునరావాసం కల్పించిన వివరాలను ప్రతివారం పత్రిక ముఖంగా తెలియజేయాలని సూచించారు. 

 పౌష్టికాహారం అందిస్తే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు 

పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా న్యూట్రీషియన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మానవ వనరులు ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి జరుగుతుందని, గర్భిణీలు బాలింతలకు మంచి పౌష్టికాహారం అందిస్తే పుట్టబోయే బిడ్డలు ఆరో గ్యంగా ఉంటారని కలెక్టర్ అన్నారు. 

అంగన్వాడి కేంద్రాలలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు చురు కుగా పని చేసి గర్భిణీలు బాలింతలకు పౌష్టిక ఆహారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు,  జిల్లా శిశు సంక్షేమ అధికారిని సునంద, వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, హార్టికల్చర్ అధికారి అక్బర్, సిపిఓ లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, అదనపు పిడి నర్సింలు, డిఎస్పీ మొగళ్లయ్య, ఏఆర్ డి ఎస్ పి నరేందర్ రావు,  చైల్డ్ వెల్ ఫేర్ చైర్ పర్సన్ సహదేవుడు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్, డిసిపిఓ  నరసింహులు, సిడిపిఓలు, ఎన్.జీ.ఓలు , చైల్డ్ లైన్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

 చేశారు. నిరసన కార్యక్రమాల్లో ఆశాలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.