calender_icon.png 27 February, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాముకాటుతో చిన్నారి మృతి

27-02-2025 12:50:11 AM

చిట్యాల, ఫిబ్రవరి 26 : పాము కాటుతో ఓ చిన్నారి మృతి చెందిన విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారంలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిన్నెర శిరీష, రాజు దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం  సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కీర్తన (7) ఉన్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా చిన్నారిని  పాము కాటు వేసింది. వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది.