21-03-2025 01:17:45 PM
అక్కడికక్కడే దుర్మరణం
డ్రైవర్ ను చితకబాదిన స్థానికులు
రాజేంద్రనగర్: నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి టాటా ఏస్ వాహనం దూసుకెల్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధిలోని రాళ్లగూడ దొడ్డిలో శుక్రవారం జరిగింది. చిన్నారి మృతితో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్థానికులు ఆటో డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.