calender_icon.png 7 February, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి మృతి

07-02-2025 12:04:50 AM

పెద్దఅంబర్‌పేటలో ఘటన

ఎల్బీనగర్, ఫిబ్రవరి 6: అప్పటి వరకు స్కూల్‌లో చిన్నారులతో సరదాగా గడిపిన చిన్నారి.. స్కూల్ వ్యాన్ దిగి ఇంటికి వెళ్తుండగా వ్యాన్ రివర్స్‌లో వచ్చి ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటన పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని హనుమాన్ హిల్స్‌లో బొబ్బి  నర్సింహ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

వారి కుమార్తె రిత్విక(4) హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఎల్‌కేజీ చదువు  గురువారం ఉదయం స్కూల్ వ్యాన్‌లో పాఠశాలకు వెళ్లి, మధ్యాహ్నం అదే వ్యాన్‌లో ఇంటికి వచ్చింది. వ్యాన్ దిగగానే  చిన్నారిని గమ   డ్రైవర్ వాహనాన్ని వెనక్కి పోనివ్వడంతో రిత్విక తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. హయత్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ కొమ్ము గణేశ్(27)ను అదుపులోకి తీసుకున్నారు.