28-08-2024 03:13:47 AM
వైద్యారోగ్యశాఖ అధికారులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
కామారెడ్డి, ఆగస్టు 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం వైద్యుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణం తీసింది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. పి ట్లం మండలం కాటెపల్లి గ్రామానికి చెందిన శంకర్, కృష్ణవేణి దంపతుల మూడేళ్ల కుమారుడు హేమంత్‌కు సోమవారం జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు సరైన చికిత్స అందించకుండా కేవలం గ్లూకోజ్ బాటిల్ పెట్టి వైద్యులు చేతులు దు లుపుకోవడంతో చి న్నారి పరిస్థితి విషమి ంచింది. దీంతో తల్లిదండ్రులు మంగళ వారం చిన్నారిని ప్రై వేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెం దాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రు లు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నా రి మృతిపై మృతుడి తల్లిదండ్రులు జిల్లా వైద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.