calender_icon.png 1 November, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరైన వైద్యం అందక చిన్నారి మృతి

01-11-2024 10:59:27 AM

సూర్యాపేట, (విజయక్రాంతి): సమయానికి సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించడం ద్వారా ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మొడెం యాకయ్య స్వర్ణలత దంపతుల రెండవ కుమార్తె మొడెం ఉద్ధిజ్ఞ (7) కు జ్వరం రావడంతో గురువారం దీపావళి పండుగ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల ఆసుపత్రికి  తీసుకొచ్చారు.

చిన్నారికి చికిత్స అందించడంలో వైద్యుడు నిర్లక్ష్యం వహించడం ద్వారా తమ చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. తమ చిన్నారి మృతికి కారణమైన వైద్యుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై వైద్యుడిని వివరణ కోరగా తాము సరైన సమయానికి వైద్యం అందించమని, చికిత్స అందించే సమయంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చిన్నారిని మెరుగైన చికిత్స కొరకు వేరొక ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలని సూచించినట్లు తెలిపారు. అయితే తల్లిదండ్రులు వైద్యం అందించాలని కోరారని, అంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని వైద్యులు వివరించారు. పోలీసులకు బంధువులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.