దక్షిణ భారతదేశంలో బొగ్గు గనులు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఇది 49:51నిష్పత్తి లో కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నది. ఇంధనం, విద్యుత్తుకు అవసరమయ్యే బొగ్గును సరఫరా చేస్తుంది. సంస్థ పరంగా, ఇతరత్రా దాదాపు 2000 పైగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ మహిళలకు ప్రత్యేకంగా అవసరమ య్యే విశ్రాంతి గదులు, శిశు సంరక్షణ నిలయాలు (క్రెచ్‌లు) కల్పించబడలేదు ఫలితంగా వారు చాలా విపత్కర పరిస్థితులను ఎదు ర్కొంటున్నారు ముఖ్యంగా శిశు సంరక్షణ నిలయాలు లేకపోవడం వలన పిల్లల ఆలనా పాలన కోసం పరితపిస్తూ తల్లడిల్లి పోతుంటారు.
మరో పక్క విధులకు కూడా సరియైన న్యాయం చేయలేక పోతున్నామని మనోవేదనకు గురి అవుతుంటారు. ప్రభుత్వంలో రాజకీయ భాగస్వామ్య పొందుటకు లోక్‌సభలో మహిళల కోసం 33 శాతం స్థానాలు కేటాయించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి, ఇతరత్రా మహిళలను గౌరవించే ప్రత్యేక పథకాలను సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫ్యాక్టరీ, మైన్స్ చట్టాలు మహిళలకు ప్రత్యేకంగా విశ్రాంతి శిశు సంరక్షణక నిలయాలు ఏర్పాట్ల గురించి ప్రస్తావించినా సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
- దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్