13-02-2025 11:20:53 PM
చిన్నారికి బెత్తంతో వాతలు..
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురం సెంటర్-1 అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకునేందుకు వచ్చిన చిన్నారి ఇరుగు కుషి పై అక్కడ పని చేసే ఆయా దాడి చేసి, పచ్చి బరెకతో చిన్నారిని వీపుపై వాతలు పడేలా విచక్షణ రహితంగా కొట్టడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి కూత వేటు దూరంలోనే ఉండడం గమనార్హం.
ఆయా, చిన్నారిని పచ్చిబరెకతో విచక్షణరహితంగా కొట్టడడం వల్ల పాప ఒంటిపై వాతలు తేలాయని, జ్వరం కూడా వచ్చిందని, సంబంధిత సెంటర్ ఆయాను, అంగన్‌వాడీ టీచర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలను బెత్తంతో కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సంబంధిత ఆయాపైనా, టీచర్‌పైనా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కుటుంబ సభ్యులు బండ్ల వెంకటనారాయణ పేర్కొన్నారు.