calender_icon.png 25 December, 2024 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొవిడ్ తర్వాత చికున్‌గున్యా విజృంభన

25-12-2024 01:17:29 AM

  1. మూడేళ్లుగా పెరుగుతున్న కేసుల సంఖ్య
  2. డబ్ల్యూహెచ్‌వో  నివేదికలో వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): కొవిడ్ తర్వాత చికున్ గున్యా విజృంభిస్తున్నది. 2018 నుంచి 2024 వరకు దేశవ్యాప్తంగా చికున్ గున్యా కేసులు పెద్ద ఎత్తున పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్ ఈస్ట్ ఏసియా ఎపిడిమియోలాజికల్ నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో కొవిడ్ సమయంలో తగ్గుముఖం పట్టిన కేసులు ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు గత ఆరేళ్ల సగటుతో పోలిస్తే కేసులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్‌కు సమీపంలో ఉన్నందున, తెలంగాణలో కూడా ఈ ఏడాది కేసులు బాగా పెరిగాయి.

గత ఏడాది కేవలం 51 కేసులు నమోదవ్వగా.. 2024 డిసెంబర్ మొదటి వారం వరకే ఆ సంఖ్య 480కి పెరిగింది. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఒక్క ఏడాదే 480 కేసులు నమోదవ్వడం ఆందోళనకరం. 2017లో 58 కేసులు నమోదైతే ఆ తర్వాత రెండేళ్ల పాటు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 2018లో 489 కేసులు, 2019లో 1,358 కేసులు నమోదు అయ్యాయి.

ఆ తర్వాత కొవిడ్ ప్రభావంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావడమే మానేయడంతోపాటు కరోనా ప్రభావంతో చికున్ గున్యా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది చికున్ గన్యా కేసుల్లో మహారాష్ర్ట దాదాపు 5వేల కేసులతో ముందంజలో ఉండగా.. కర్ణాటకలో 2వేల కేసులు, రాజస్థాన్‌లో 500 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 480 కేసులు నమోదు అయ్యాయి.