హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 19వ తేదీ వరకు 447 చికున్ గున్యా కేసులు నమోదైనట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.బి.రవీందర్‌నాయక్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 13,320 నమూనాలను పరీక్షించినట్టు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో అత్యధికంగా 183 కేసులు, జూలైలో అత్యల్పంగా ఒక్క కేసు మాత్రమే నమోదైందన్నారు. చికున్ గున్యా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపారు.
నవంబర్‌లో 19వ తేదీ నాటికి 12 కేసులు నమోదయ్యాయన్నారు. చికున్ గున్యా నివారణకు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించామని.. హైరిస్క్ ప్రాంతాల్లో కీటకనాశన చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ర్టంలో చికున్ గున్యా కేసులు అదుపులోనే ఉన్నాయన్నారు.