calender_icon.png 4 January, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్

01-01-2025 02:40:09 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెంలో ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తీక్ గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు వెన్నుదన్నుగా ఓట్లు వేసి గెలిపించిన యువతకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితలకు, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేందుకు ప్రయత్నిస్తామని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. సామాన్యుడి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చీకటి కార్తీక్ తెలిపారు.