మేడ్చల్, జనవరి 20(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 7.89 కోట్ల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ, రోడ్లు తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు.
నిజాంపేట్ నుంచి బాచుపల్లి వరకు రూ .4.69 కోట్లతో చేపట్టిన డివైడర్, బాచుపల్లి లోని దీపిక కాలనీ నుంచి పూజిత కాలనీ వరకు కోటి 20 లక్షల నిధులతో సిసి రోడ్లు, రెండు కోట్ల 20 లక్షల రూపాయల తో నిర్మించిన తెలుగు యూనివర్సిటీ వద్ద బిటి రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ సాబీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కొలను హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.