calender_icon.png 26 December, 2024 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

06-12-2024 04:31:40 PM

కాప్రా : చర్లపల్లి డివిజన్ లోని మారుతి నగర్ కాలనీ నాయకుడు మల్లేష్ ప్రమాదవశాత్తు చెయ్యి విరగడంతో అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹1,00,000/- రూపాయలు మంజూరు చేయించి ఆయనకు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతని, అదేవిధంగా డివిజన్లో ఏ సమస్య ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేను అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మున్ని, నవనీత సత్యమ్మ, బత్తుల శ్రీకాంత్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.