21-02-2025 01:46:48 PM
పోలేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వికారాబాద్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి పోలేపల్లిలో నిర్వహించే శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరకు శుక్రవారం హాజరయ్యారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నాయకులు పాల్గొన్నారు.