calender_icon.png 20 November, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

20-11-2024 01:57:15 PM

కరీంనగర్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం 679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అదేవిధంగా రూ.236 కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 166 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల పాస్టర్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 50 కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో నిర్మాణం, 47 కోట్ల 85 లక్షలతో మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

42 కోట్లతో రుద్రంగి మండలంలో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. వేములవాడ పట్టణంలో కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ను ప్రారంభోత్సవం చేశారు3 కోట్ల 80 లక్షలతో వేములవాడ పట్టణంలో మురుగు కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వీర్నపల్లిలో కోటి యాభై లక్షలతో పి.హెచ్.సి నిర్మాణం, మేడిపల్లిలో 5 కోట్లతో జూనియర్ కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకు 5 కోట్లు, కాళేశ్వరం ప్యాకేజీ 9 పనులకు 11 కోట్ల 79 లక్షలు విడుదల చేశారు. సీఎం రేవంత్ ప్రజా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగాపై పేర్కొన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.