calender_icon.png 12 January, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి కాదు నీది కౌశిక్

12-01-2025 06:16:51 PM

మాజీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు...

హుజురాబాద్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని విమర్శించే స్థాయి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) లేదని హుజురాబాద్ మాజీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎమ్మెల్యే గెలిచి సంవత్సరం అయినప్పటికీ హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం కాదు నీవు తీసుకురావాల్సిన 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నీవు తెస్తానన్న 1000 కోట్లు తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోతే నిన్ను హుజరాబాద్ లో తిరగనియ్యబోమని హెచ్చరించారు. కేసీఆర్ కి వత్తాసు పలుకుతూ తొత్తు లాగా మారారని అన్నారు. వెంటనే నీ పద్ధతి మార్చుకో లేకపోతే ప్రజలు తరిమి కొడతారన్నారు.