calender_icon.png 24 October, 2024 | 3:03 PM

దివ్యాంగుల ఆత్మబంధువు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

11-07-2024 12:55:58 AM

వారికి సంక్షేమశాఖ ఏర్పాటు కాంగ్రెస్ ఘనతే

మంత్రులు ఉత్తమ్, సీతక్క   

కార్మికుల సంక్షేమానికి కృషి: మంత్రి శ్రీధర్‌బాబు

పలువురు కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

మంత్రులు పొన్నం, జూపల్లి హాజరు

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఇటీవల నియామకమైన పలువురు కార్పొరేషన్ చైర్మన్లు బుధవారం తమ కార్యాలయా ల్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. దివ్యాంగుల కోసం సంక్షేమ శాఖను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, అలాంటి శాఖను కేసీఆర్ భ్రష్టు పట్టించారని మంత్రులు ఉత్తమ్, సీతక్క అన్నారు.

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి జీవనం కొనసాగిస్తున్న దివ్యాంగులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రజాదీవెనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పని చేస్తుందని సీతక్క చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగుల ఆత్మబంధువు అని కొనియాడారు. వారికోసం ఎన్నో బృహత్తరమైన కార్య క్రమాలు చేపడుతున్నారని తెలిపారు. బుధవారం మలక్‌పేటలోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షే మ, సహకారశాఖ కార్యాలయంలో జరిగిన దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రమాణ స్వీకారానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు బల్మూ రి వెంకట్, తీన్మార్ మల్లన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ హాజరయ్యారు. 

-ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి 

రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి హైదరాబాద్ బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

-ట్రైకార్ చైర్మన్‌గా డాక్టర్ బెల్లయ్య 

షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా డాక్టర్ బెల్లయ్యనాయక్ బాధ్యతలు చేపట్టారు. మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొన్నం అతిథులుగా హాజరయ్యారు. మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు. 

పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి

రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిం చారు. లక్డీకాపూల్‌లోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా బీ జనక్‌ప్రసాద్ బాధ్యతలు

కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. చిక్కడపల్లిలోని అంజయ్య భవన్ కార్మిక శాఖా కార్యాలయంలో శ్రీధర్ బాబు సమక్షంలో కనీస వేతనాల మండ లి బోర్డు చైర్మన్‌గా ఐఎన్‌టీయూసీ జాతీ య కార్యదర్శి జనక్‌ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వానికి వారధిగా జనక్‌ప్రసాద్ పనిచేయాలని ఆకాంక్షించారు. నూతనంగా చైర్మన్ పదవులు స్వీకరిస్తున్న అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్లుగా నియమితులైన సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అన్వేశ్‌రెడ్డి సచివాలయంలో శ్రీధర్‌బాబును కలిశారు.