calender_icon.png 3 April, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయలేదు

01-04-2025 09:04:16 PM

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి..

బూర్గంపాడు (విజయక్రాంతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయలేదని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులపై కేసు నమోదు చేయాలని బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ... 6 గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి ప్రజలకు వంద రోజుల హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి 15 నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయడం దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సాని కొమ్ము శంకర్ రెడ్డి, సాధిక్ భాష, బొల్లు సాంబశివరావు, కోనకాంచి శ్రీను, వలదాసు సాలయ్య, కేవి రమణ, కర్రీ నాగేశ్వరరావు, రంజిత్, బానోత్ శ్రీను, బెజ్జంకి కనకాచారి, సీతారాం నాయక్, చెక్క నరసింహారావు, కోట జయరాజు, దుర్గ, భూక్య కృష్ణ, షేక్ బికారి, సయ్యద్ కరీం, వెంకటేశ్వర్లు రంజిత్, గంగాపురి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,