calender_icon.png 19 March, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

19-03-2025 05:40:37 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, 42 శాతం బీసీలకు రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఆమోదింపజేసి, దేశానికి మార్గదర్శకత్వం చూపించిన సందర్భాన్ని పురస్కరించుకొని, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధోనికేని దయానంద మాట్లాడుతూ.... బడుగు, బలహీన వర్గాల పక్షంలోనే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడగల భూషణ్, పిఎసిఎస్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, మాజీ జెడ్పిటిసి ఆకుల వెంకా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంశీ, కడార్ల గంగ నరసయ్య, మాజీ ఎంపీటీసీ జంగిలి శంకర్, నాయకులు జన్నారపు శంకర్, పరిమి సురేష్, జహీర్, లక్ష్మీపతి గౌడ్, సార్ల నరసయ్య, మసుల లక్ష్మీరాజ్యం, గొర్రె గంగాధర్, భూమన్న, శేషాద్రి, శంకర్, వీరేష్, రవి, రాజన్న, రామచందర్, నారాయణ, రాజేశ్వర్, నయీమ్ తదితరులు ఉన్నారు.