calender_icon.png 8 April, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

06-04-2025 08:16:21 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జ్ పై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడుతూ... బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో క్యాతనపల్లి పురపాలకం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు.

ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు ఏళ్ళ తరబడి జరగకుండా కాలయాపన చేసినందుకు పుర ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గత బిఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిది వొడ్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, మెట్ట సుధాకర్, పలిగిరి కనకరాజు, గోపతి బానేష్, పనాస రాజు, కొక్కుల సతీష్, బింగి శివ, ఎర్రబెల్లి రాజేష్, కట్ల రమేష్, పుల్లూరి కళ్యాణ్, గోపు రాజం, లాడెన్, మేకల శ్రీను, ఆకుల వెంకటస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె దినేష్, మండల వైస్ ప్రెసిడెంట్ బోనగిరి రవి, రామకృష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.