calender_icon.png 20 March, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

20-03-2025 12:00:00 AM

నిజాంసాగర్, మార్చి 19 : కాంగ్రెస్ ప్రభుత్వంలో  మూడు ఘనవిజయాలు,బీసీ రిజర్వేషన్ల బిల్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లు,రాజీవ్ యువ వికాస పథకం అసెంబ్లీ లో చట్టం చేయడం,యువ వికాసంపథకం దిగ్విజయం గా ప్రారంభించడం తో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో  బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ. ఒకే రోజు మూడు ఘన విజయాలను ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.  రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ ప్రజా ప్రభుత్వం.. మూడు బిల్లులను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఇమ్రోజ్, ప్రతాపరెడ్డి,లక్ష్మయ్య సార్,గైని జగన్, ప్రజా పండరి, కిష్టారెడ్డి, వెంకటరామిరెడ్డి, గౌస్ పటేల్, అనీస్ పటేల్, పాల్గొన్నారు.

బిచ్కుందలో..

బిచ్కుంద, మార్చి 19 : కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బుధవారం ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రాష్ర్ట శాసనసభలో ఆమోదం తెలిపినందుకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాష్ర్ట ప్రభుత్వం ఆమోద తెలుపడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్ప, మండల అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షులు రవి పటేల్, విట్టల్ రెడ్డి, దడ్ది నాగ్నాథ్, పట్టణ అధ్యక్షులు సాహెల్ సేట్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, మైనారిటీ సీనియర్ నాయకులు పాషా సెట్, సాయిని బస్వరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.