26-02-2025 12:52:04 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బుధవారం ఉద యం 10:30 గంటలకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, డీజీపీ జితేందర్‌తో కలిసి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు బృందం మంగళవారమే ఢిల్లీ చేరుకున్నది.
సీఎం బృందం మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం, రాష్ట్రానికి ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని ప్రధాని మోదీని కోరనున్నారు. ఈ మేరకు ప్రధానంత్రికి వినతిపత్రం అందజేయనున్నారు. కేం ద్రం ఏ మేరకు సీఎం మొర వింటుందోనని, ఏమాత్రం నిధులు విడుదల చేస్తుందోననే చర్చ ఇప్పుడు సర్వత్రా నెలకొన్నది.
సీఎం, మంత్రుల బృందం ఇప్పటి కే అనేకసార్లు ఆర్థికసాయం కోసం ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్రం పైసా అయినా విదిల్చని సంగతి తెలిసిందే. దీంతో ఈసారై నా కేంద్రం కరుణిస్తుందోమోనన్న చర్చ రాజకీయ వర్గా ల్లో జరుగుతున్నది. సీఎం బృందం పలువురు కాంగ్రెస్ పెద్దలతో కూడా భేటీ కానున్నట్లు తెలిసింది.
తెలంగాణలో రాజకీ య పరిణామాలు, మం త్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిం చే అవకాశం ఉం దని సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఎ మ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ అంశంపైనా సీఎం బృందం చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి, కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉంది. దీంతో అధిష్ఠానం ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపైనా చర్చిస్తుందని సమాచారం.