calender_icon.png 26 December, 2024 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలిచాలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

26-12-2024 01:23:46 AM

కరీంనగర్ సిటీ, డిసెంబర్ 25 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్‌రావు తన జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.  రేవంత్ రెడ్డి రాజేందర్ రావుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజేందర్ రావు నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ కరీంనగర్ అభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదిం చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి రాజేందర్‌రావు ముఖ్యమంత్రి తో మాట్లాడారు.  కరీంనగర్ పర్యటనకు రావాలని మరోసారి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలో కరీంనగర్‌కు వస్తానని పేర్కొన్నారని రాజేందర్ రావు తెలిపారు.