calender_icon.png 5 January, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా..

31-12-2024 01:47:45 AM

ఏపీ ఉప ముఖ్యమంతి పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌ను కలిశారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించాలని భావిస్తున్నామని.. కాబట్టి దానికి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని కోరారు.

దీనికి పవన్ అంగీకరించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది. పవన్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో కియారా అద్వాని కథానాయికగా నటించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు జనవరి 4, 5 తేదీల్లో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘గేమ్ ఛేంజర్’ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముం దుకు రానుంది.