శతాబ్దంలోనే భయంకర సైక్లోన్‌గా రికార్డు
వందల సంఖ్యలో మృతులు?
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు
పారిస్, డిసెంబర్ 16: చిడో తుఫాన్ ఫ్రాన్స్ దీవులను వణికిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారని అంతా భావిస్తున్నా రు. శతాబ్దంలో ఇంత భయంకర తుఫాన్‌ను చూడలేదని ఫ్రెంచ్ వాసులు పేర్కొంటున్నారు. హిందూ మహాసముద్రంలోని ద్వీప సముదాయమైన మయోట్ తుఫాన్ ధాటికి అతలాకుతలం అయింది. తుఫాన్ బాధితుల గురించి ఆరా తీసినపుడు ‘బాధితులను లెక్కించడం కష్టతరం’ అని అంతర్గత భద్రతా శాఖ వ్యాఖ్యానించింది.
అర్ధరాత్రి పూట 200 మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినట్లు అక్కడి వారు పేర్కొన్నారు. ఇళ్లు, ప్రభు త్వ భవనాలు, ఆసుపత్రులు ఈ గాలుల ధాటికి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గడిచిన 90 ఏళ్ల నుంచి ఇంతటి బలమైన గాలులు ఈ ద్వీపాల్లో వీయలేదని పలువురు పేర్కొంటున్నారు. ‘అణుయుద్ధం ఎంత భయంక రంగా ఉంటుందో.. ఈ తుఫాన్ చూసినపుడు కూడా అలాగే అనిపించింది’ అని మయోటీ రాజధాని మమౌద్జౌ నివాసి ఒకరు మీడియాతో ఫోన్‌లో వ్యాఖ్యానించారు.
వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తుఫాన్ ప్రభావం వల్ల నేలమట్టం అయిన ఇండ్ల ఫొటోలు స్థానిక మీడి యాలో ప్రసారం అయ్యాయి. ఈ తుఫాన్ వల్ల చనిపోయిన వారికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుఫాన్ వల్ల కేవలం 14 మంది మాత్రమే చనిపోయారని అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతి చెందిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.